02-12-2025 01:04:30 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, డిసెంబర్ 1 (విజయ క్రాంతి): పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చే స్తారని జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 11 వ వార్డులో రు.11 లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాంధీనగర్ ను సందర్శించి ఓపీ రిజిస్టర్ పరిశీలించి,మందులు,ల్యాబ్ రిపోర్టులు సదుపాయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వ్యాధిగ్రస్తులకు,ప్రజలకు నిత్యం ఎయిడ్స్ వ్యాధి పై తీసుకుంటున్న అవగాహన కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ ను సందర్శించి మౌలిక సదుపాయాలు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రభుత్వం అనునిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వైద్యులు చికిత్స అందించడం అభినందనీయమన్నా రు.ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు భయపడకుండా వారి వ్యాధి గురించి వైద్యులకు తెలియజేయడం వల్ల ముందస్తు జాగ్రత్తలు చేపడతారన్నారు.ఎయిడ్స్ రోగులను సమాజం నుండి దూరం చేయకుండా ప్రజలు మద్దతుగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఆనంద్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,మాజీ కౌన్సిలర్ లు బాలే శంకర్,డిష్ జగన్ పంబల రాము,పద్మావతి పవన్ తదితరులు పాల్గొన్నారు.