22-08-2025 12:17:01 AM
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 21 (విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరారు. ఆయనకు ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వారు రేగులపాటి కృష్ణదేవరావు గతంలో వేములవాడ ఎమ్మెల్యేలుగా గెలిచినవారు కనీసం చూద్దామంటే కనిపించలేదని కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన నెరవేరుస్తూ ముందుకు పోతానని పేర్కొన్నారు.