19-07-2025 01:50:39 AM
బిగ్‌బాస్ కంటెస్టెంట్ అమర్‌దీప్ హీరోగా ‘సుమతీ శతకం’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ఎంఎం నాయుడు వింటేజ్ విలేజ్ డ్రామా, లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తుండగా, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి కథానాయిక సయాలీ పాత్రకు సంబంధించి లుక్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనే లక్ష్యంతో షూటింగ్ శరవేగంగా నిర్వహిస్తున్నామని నిర్మాత తెలిపారు. టేస్టీ తేజ ముఖ్యపాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి సంగీతం దర్శకుడిగా సుభాష్ ఆనంద్, మాటల రచయితగా బండారు నాయుడు, ఎడిటర్‌గా నాహిద్ మొహమ్మద్, డీవోపీగా హాలేశ్ పనిచేస్తున్నారు.