calender_icon.png 17 September, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో..

17-09-2025 02:01:17 AM

వేములవాడ సిరికొండ రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్ల సీఆర్‌ఐఎఫ్ నిధులు మంజూరు

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 16 (విజయక్రాంతి)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ముందుకు పోతున్న విషయం విదితమే. రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో పెండింగ్ లో ఉన్న పనుల ఒక్కొక్కటిగా చేస్తూ ముందుకు పోతుంది..వేములవాడ నియో జకవర్గ పరిధిలో పలు రోడ్లు,బ్రీడ్జీల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

కోరగా ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కలసి తెలంగాణ రాష్ట్రములోని పలు రోడ్లు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయవలసిందిగా కోరగా సానుకూలంగా స్పందించిన. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . కోరిక మేరకు వేములవాడ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టితో వేములవాడ- సిరికొండ రోడ్డు సుమారు 18 కిలోమీటర్ల మేర.

వేములవాడ రూరల్ మండలం హన్మజిపేట గ్రామా శివారు 10/02 కిలోమీటర్ల నుండి కొనరావుపేట మండలం మామిడిపల్లి,బావుసాయిపేట, వట్టిమల్ల, భూక్య రెడ్డి తండా మీదుగా ఆజ్మీరా తండా శివారు 28/0 కిలోమీటర్ల వరకు సుమారు 18 కిలోమీటర్ల వరకు 23 కోట్ల కేంద్ర రహదారుల మౌలిక సదుపాయల నిధి సీఆర్‌ఐఎఫ్ నిధులు మంజూరు. చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా కలసి కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.