17-09-2025 02:02:59 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రిటైర్డ్ ఐఆర్‌ఏఎస్ అధికారి ఎన్‌వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. మెట్రో రైల్ ఎండీగా ఉంటూ.. పదవీ విరమణ చేసిన ఎన్‌వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు (పట్ట ణ రవాణా)గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.