calender_icon.png 31 January, 2026 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో..

04-08-2024 03:24:33 AM

హనుమకొండ, ఆగస్టు ౩ (విజయక్రాంతి): అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపర్తి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని గణేష్ కుంటతండాకు చెందిన రైతు వెంకన్న(33) తన అవసరాల కోసం అప్పులు చేశాడు. అప్పు తీర్చని కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. తీవ్ర మనోవేదనకు గురైన వెంకన్న శనివారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు. మృతుడికి భార్య రజిత, కొడుకు, కూతురు ఉన్నారు.