04-08-2025 12:10:14 AM
నాగర్‌కర్నూల్ జిల్లా బెట్లలో ఘటన
నాగర్‌కర్నూల్, ఆగస్టు 3 (విజయక్రాంతి) : కల్తీ కల్లు సేవించి మహిళా మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ని యోజకవర్గం యన్మన్ బెట్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మరాఠీ మంగమ్మ (45) ఆ దివారం గ్రామంలోని కల్లు దుకాణం వద్ద కల్లు సేవించి కొద్ది సేపటికి బయటికి వస్తుండగా స్పృహ తప్పి పడిపోయి మృతి చెం దింది. దీంతో కుటుంబ సభ్యులు కల్లు దుకాణంపై దాడి చేశారు. సీసలు, ట్రేలను ధ్వం సం చేశారు. విషయం తెలుసుకున్న ఎక్సుజ్ అధికారులు కల్తీకల్లు శాంపిల్ సేకరించి దు కాణాన్ని సీజ్ చేశారు. పోలీసులు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.