26-05-2025 12:56:18 AM
చేవెళ్ల, మే 25: స్కూటర్ పై నుంచి జారి పడి మహిళ మృతి చెందింది. ఎస్త్స్ర శిరీష వివరాల ప్రకారం.. చేవెళ్ల మున్సిపాలిటీలోని ఇబ్రహీంపల్లికి చెందిన మంగలి లక్ష్మి(32) వివేకానంద స్కూల్ లో ఆయాగా పనిచేస్తోంది. ఆదివారం స్కూల్ లో ప్రోగ్రాం ఉండడంతో ఉదయం 8.30 గంటల సమయంలో మున్సిపల్ కేంద్రానికి వచ్చింది. అయితే అప్పటికే స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో అటుగా స్కూటర్ పై వెళ్తున్న మహేందర్ అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగింది.
అతను ఆమెను ఎక్కించుకొని అయ్యప్ప టెంపుల్ వద్దకు వెళ్లగానే.. లక్ష్మి ప్రమాదవశాత్తు జారి కింద పడింది. ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే మహేందర్ రెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త మంగలి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనట్లు ఎస్త్స్ర తెలిపారు.