27-11-2024 03:21:25 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మహిళలకు గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కంసవ్వ తాడ్వాయి వద్ద రోడ్డుపై చిట్యాల బస్ స్టాప్ వద్ద ఆగి ఉండడంతో బస్సు ఆపేందుకు వచ్చి గైని కంసవ్వ అనే మహిళను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కంసవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించి చికిత్స నిమిత్తం మహిళను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని తాడ్వాయి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.