calender_icon.png 7 February, 2026 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో అతివలదే ఆధిపత్యం

07-02-2026 12:00:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురుషుల ఓట్లతో పోలిస్తే మహిళల ఓట్లు అధికంగా ఉండడంతో మున్సిపల్ ఎన్నికల్లో అతివలదే అధిపత్యంగా నిలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, స్టేషన్ ఘనాపూర్, ములుగు, నర్సంపేట, పరకాలలో ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇందులో జయశంకర్ భూపాలపల్లి మినహ మిగిలిన 11 మున్సిపాలిటీల్లో పురుషుల ఓట్ల తో పోలిస్తే మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. నర్సంపేటలో పురుషుల ఓట్లు 19,642 ఉండగా, మహిళల ఓట్లు 21,323 ఉన్నాయి. ఇదేవిధంగా జనగామలో పురుషుల ఓట్లు 21,358, మహిళల ఓట్లు 22,678, వర్ధన్నపేటలో పురుషులు 5,109, మహిళలు 5,416, డోర్నకల్ లో పురుషులు 5,160,

మహిళలు 5,709, మరిపెడలో పురుషులు 6,709, మహిళలు 6,978, తొర్రూర్ లో పురుషులు 10,501, మహిళలు 10,942, కేసముద్రంలో పురుషులు 7,754, మహిళలు 8,191, ములుగులో పురుషులు 6,661, మహిళలు 7,300, స్టేషన్ ఘనాపూర్ లో పురుషులు 8,913, మహిళలు 9,636, పరకాలలో పురుషులు 13,216, మహిళలు 13,433 ఓట్లు ఉన్నాయి. ఒక భూపాలపల్లి లో మాత్రం మహిళల ఓట్లు 25,936 ఉండగా, పురుషుల ఓట్లు 26,786 ఉన్నాయి. దీనితో మున్సిపల్ ఎన్నికల్లో మహిళల ఓట్లు ప్రజాప్రతినిధుల ఎన్నికలో కీలకం కానున్నాయి.

మానుకోట జిల్లాలో రెండు మున్సిపాలిటీల చైర్ పర్సన్ పదవులు మహిళలకు కేటాయింపు

మహబూబాబాద్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవులను మహిళలకు కేటాయించారు. కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎస్టి మహిళకు కేటాయించగా, మరిపెడ చైర్ పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు.

అలాగే మానుకోట జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలో కలిపి 98 వార్డు కౌన్సిలర్ పదవులు ఉండగా, మహిళలకు 50 శాతం ప్రకారం 48 వార్డులను కేటాయించారు. ఇందులో డోర్నకల్ మున్సిపాలిటీలో 7, మహబూబాబాద్ లో 18, మరిపెడలో 7, తొర్రూర్ లో 7, కేసముద్రంలో 7 వార్డు కౌన్సిలర్ పదవులను మహిళలకు కేటాయించారు.