01-08-2025 12:52:52 AM
-ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్, జూలై ౩1 (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాలో అక్రమ గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నియంత్రణ చర్యలు చేపట్టినట్టు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మహిళా పోలీసులకు గంజాయి నియంత్రణపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు అనంతరం సమావేశాన్ని నిర్వహించి ఆమె మాట్లాడారు మిషన్ గంజా గస్తీ కింద బలమైన సందేశాన్ని ఇచ్చారు.
గత ఆరు నెలలుగా కేజీబీవీ పాఠశాలల్లో పోలీసు అక్కలు నేరుగా పిల్లల చెంత కు వెళ్ళి, నెలలో ఒకరోజు వారితో గడిపి విద్యార్థుల సాధక బాధకాలను తెలుసుకుం టూ, పిల్లలతో మమేకమై, ఆనందంగా, ఉత్సాహంగా సమయం గడుపుతూ, వారి తో కలసి భోజనం చేసి, విద్యార్థుల్లో నమ్మ కం, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా పోలీసు అక్కలు తమ పాత్రను నిబద్ధతతో నిర్వహిస్తారు.
అదే నిబద్ధతతో ‘పోలీస్ అక్కలు తమ స్టేషన్ పరిధిలో, గంజాయి సంబంధిత కార్యకలాపాలను నిర్మూలించడంలో చురుకుగా పాల్గొనాలి‘. మాదక ద్రవ్యాల నిర్మూలన పై పోలీసు అక్కలు ముఖ్యంగా యువతకు అవగాహన కార్యక్రమాలు కల్పించి, యువతను చైతన్య పరచాలని సూచించారు. అదే విధం గా మిషన్ గాంజా గస్తీ కూడా మహిళా అధికారుల దైనందిన పోలీసింగ్‌లో భాగంగా మారాలి‘ అని స్పష్టం చేశారు. సమీక్ష అనంతరం గంజా గస్తీ ప్రచారంలో పాల్గొననున్న పోలీస్ అక్కలకు బ్యాడ్జిలు, బ్యాగులు, టీ-షర్టులు పంపిణీ చేశారు.