calender_icon.png 23 July, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

23-07-2025 12:00:00 AM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ టౌన్ జూలై 22 (విజయక్రాంతి): మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.మంగళవారం వేములవాడ పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో మహిళా బ్యూటీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేకప్ మరియు హెయిర్ పే నిర్వహించిన ఒక్క రోజు సెమినార్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీ నివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతీ ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.

వారు మాట్లాడుతూ మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలని అన్నారు..తము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులను అప్ గ్రేడ్ చేసుకుంటూ ముందుకు పోవలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని అన్నారు..అందులో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలు చేయూత ఇస్తుందనిపేర్కొన్నారు.