calender_icon.png 25 October, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయండి

24-10-2025 12:00:00 AM

ఇటిక్యాల/అలంపూర్, అక్టోబర్ 23:ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి యం సంతోష్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఇటిక్యాల మండలం పర్యటించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైద్య సిబ్బంది క్రమం తప్పకుండా సమయపాలన పాటించాలని ప్రజలకు సత్వర సేవలు అందించాలని ఆదేశించారు.

ఓపి,ఐపి రోగుల వైద్య సేవలు మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు నూటికి నూరు శాతం కృషి చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ అకస్మిక తనిఖీ చేశారు. భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వీరభద్రప్ప డాక్టర్ అనిరుద్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం నిల్వ వ్యవస్థ పక్కగా నిర్వహించాలి. 

ధాన్యం నిల్వ వ్యవస్థ పక్కాగా నిర్వహించి ధాన్యం నాణ్యతతో ఉండేలా పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ బియ్యం సంతోష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇటిక్యాల మండల కేంద్రంలో స్టేట్ వేరోస్ కార్పొరేషన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలోని బఫర్ గోదాములను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములను పరిశీలించి ధాన్యం నిల్వ వ్యవస్థ పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ విమల, టెక్నికల్ ఆఫీసర్ సుబ్బన్న,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.