21-11-2025 01:10:34 AM
జిన్నారం, నవంబర్ 20: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండ లం బొల్లారం పారిశ్రామికవాడలోని రాణె కంపెనీలో బీహార్‌కు చెందిన కృష్ణ సింగ్ (29) పనిచేస్తున్నాడు. గురువారం పైన రేకు లు మార్చుతుండగా పక్కన ఉన్న వెంటిలేషన్ షీట్ నుంచి కింద పడి మృతి చెందాడు.
కంపెనీ యాజమా న్యం కార్మికునికి సేఫ్టీ బెల్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించ డం వల్లనే కార్మికుడు మృతి చెందాడని స్థా నికులు ఆరోపించారు. కుటుంబీకుల ఫిర్యాదు తో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.