calender_icon.png 21 November, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనులు ప్రారంభించకపోతే నిరాహార దీక్ష

21-11-2025 01:09:59 AM

 మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వెల్లడి

చేవెళ్ల, నవంబర్ 20: 15 రోజుల్లో  వంద పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 100 పడకల ఆసుపత్రి ని వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి, బీజేపీ యువ నాయకులు వైభవ్ రెడ్డి ఆధ్వర్యం లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ర్టంలో అన్ని అసెంబ్లీ లలో 100 పడకల హాస్పిటల్ పూర్తయిన్నట్లు చెప్పారు. 

కేవలం చేవెళ్ల అసెంబ్లీలో మాత్రమే రెండు సంవత్సరాల క్రితం రూ. 17 కోట్ల 50 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.కానీ ఇప్పటివరకు పని ప్రారంభం కాలేదని, ఈ పనిని వెంటనే ప్రారంభించాలని ఎందుకు ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రాంభించడం లేదని  ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కి కమిషన్ ల పైన, భూముల లావాదేవీల పైన సెటిల్మెంట్స్ పైన ఉన్న శ్రద్ధ కాస్తన్నా చేవెళ్ల ప్రజల పైన ఉంటే చేవెళ్ల లో ఎప్పడు 100 పడకల హాస్పిటల్ పూర్తి అయ్యేదన్నారు. 

ఒక వేళ హాస్పిటల్ విషయం లో 15 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాన్నని స్పష్టం చేశారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం లో ఎక్కడ కూడా ఎమ్మెల్యే తిరగ కుండా ఆడ్డు కుంటామన్నారు. కార్యక్రమంలో  బీజేపీ నాయకులు కంజర్ల ప్రకాష్,  దేవర పాండురంగా రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,  ఎల్.  ప్రభాకర్ రెడ్డి,  చేవెళ్ల మండల అధ్యక్షులు శ్రీకాంత్, మొయినాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీకాంత్,  శంకర్పల్లీ మున్సిపాలిటీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి,  నవపేట్ మండల్ అధ్యక్షులు చంద్రకాంత్ ,ఆంజనేయులు గౌడ్, ప్రతాప్ రెడ్డి, గోపాల్ రెడ్డి మొర నర్సింహ రెడ్డి చందానగర్ శ్రీనివాస్ మిట్ట రంగారెడ్డి, కుమార్ గౌడ్, జి రమేష్,  కృష్ణ గౌడ్,  వెంకటేష్,  ఓబీసీ ఉమాశంకర్ రెడ్డి, అభిలాష్ బాబు , డి , కుంచం శ్రీనివాస్ మాధవ రెడ్డి , సురేష్ బయన్న, చేకూర్త కృష్ణ రెడ్డి వాసుదేవ్ కన్నా , కరుణాకర్ వెంకటేష్ శ్రీధర్ , పెద్దోళ్ల కృష్ణ పత్తి సత్యనారాయణ, కృష్ణ మోహన్ రెడ్డి, చీర శ్రీనివాస్, అల్లాడ శ్రీనివాస్ రెడ్డి,అల్లాడ అభిషేకర్ రెడ్డి, చాకలి శ్రీనివాస్, పాగా వెంకటేష్, ధనుష్ రెడ్డి తిరుపతి రెడ్డి  సందీప్ మధుకర్ రెడ్డి, అతేలి శేఖర్ రెడ్డి, మిట్టు జయసింహ రెడ్డి, శివ కూతురు మహేందర్ మహేష్, సింహం రాజు, నాగరాజు,  నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.