06-11-2025 12:53:23 AM
ఉప్పల్, నవంబర్ 5 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గంలోనిమల్లాపూర్‌లో చాణిక్యపురి కాలనీని సమష్టిగా కాలనీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏర్పడి నూతన కమిటీఆధ్వర్యంలో కాలనీలోనిరోడ్లు మంచినీరు మౌలిక సతుల పై దృష్టి సాధించారు. ప్రతిరోజు నిత్యం కమిటీ మెంబర్లు సమావేశమై కాలనీలోని నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ సమష్టిగా కాలనీవాసులు కృషి చేస్తు న్నారు.
ఇటీవల కాలంలోనే కాలనీ నూతన విద్యుత్ దీపాలుమంచినీరు సమస్య పార్క్ లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలిగింపు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాలనీ ఏర్పడి ఎంతో కాలమైనానూతన కమిటీ ఏర్పాటు అనంతరం కాలనీసమస్యలపై దృ ష్టి సారించారు. కాలనీ సమస్యలపై అధికారులకు ఎప్పటికప్పుడు విన్నపాలు చేస్తూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాలనీ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారుదీనిగాను కాలనీ వాసులు కూడావారికి సహకరించడంతోకాలనీలో నెలకొన్న సమస్యలు దాదా పుగా పరిష్కార దిశగా సాగుతున్నాయి.
నూతన ఆలయ కమిటీ ఏర్పాటు..
చాణిక్యపురి కాలనీలోనిదుర్గా భవాని మల్లేశ్వర పోవచమ్మ టెంపుల్‌ను అభివృద్ధి నిమిత్తం కాలనీ వాసులు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్‌తో పాటుబోర్డు మెంబర్లను ఎంపిక చేశారు. ప్రతిరోజు నిత్యం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయ అర్చకులు కూడా నియ మించారు. చాణిక్యపరి కాలనీలోని సమస్యలు లేని కాలనీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని చాణిక్యపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దశరథ అన్నారు.
గతం లో పాలక వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కాలనీలోని మౌలిక సదుపాయాలు అభివృద్ధికి నోచుకోలేదని నూతన కమిటీ ఏర్పడ్డ కాలనీ సమస్యల ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఎప్పటికప్పుడు అధికారులు ప్రతిని ధులను కలిసి తమ సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తున్నామని ఆయన తెలిపారు. రోజువారి సమావేశంలో కాలనీలోని సమస్యలు కాలనీ వాసులు తమ దృష్టి తీసుకు వచ్చారని అవి కూడా పరిష్కార దిశకు కృషి చేస్తామని అని పేర్కొన్నారు. ఆలయ నూతన కమిటీని చైర్మన్ గంధమల రాములు డైరెక్టర్లు కృష్ణమూర్తి, నాగమణి, అలివేలు పద్మను ఆయన అభినందించారు