06-11-2025 12:53:51 AM
గరిడేపల్లి, నవంబర్ 5 : మండల పరిధిలోని మర్రికుంట గ్రామ సమీపంలో గల సాగర్ ఎడమ కాలువ వద్ద ఇటీవల రెండు దేవత మూర్తులు నీటిలో లభ్యం కావడంతో స్థానిక గ్రామస్తుల్లో ఆసక్తి చెలరేగింది. కాలువలో ప్రవహిస్తున్న నీటితో కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్న ఈ విగ్రహాలు అమ్మవారికి చెందినవిగా కనిపిస్తున్నాయి.విగ్రహాలు కనిపించడంతో సమీపంలోని అయ్యప్ప స్వాములు, భక్తులు కలిసి వాటిని జాగ్రత్తగా బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.
అయితే ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి,ఎవరు ఎలా ఉంచారు.అన్నది స్పష్టత కలగాల్సి ఉంది.గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం కాలువ పైప్రాంతంలోని ఏదైనా దేవాలయం పునర్నిర్మాణం లేదా నీటి ప్రవాహం కారణంగా విగ్రహాలు ఇక్కడికి చేరి ఉండవచ్చని భావన వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు ఈ ఘటనను ఆధ్యాత్మిక సంయోగంగా భావిస్తున్నారు.సంబంధిత శాఖలు మరియు అధికారులు విగ్రహాల మూలాన్ని కనుగొనడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.