calender_icon.png 17 May, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య జీవనంతో.. రక్తపోటు దూరం

17-05-2025 04:20:06 PM

ప్రపంచ రక్తపోటు దినోత్సవం..

డీవైసీఎంఓ మధుకుమార్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఆరోగ్య జీవన విధానంతో మధుమేహం దరిచేరదని బెల్లంపల్లి సింగరేణి డివైసీఎంవో మధు కుమార్(Bellampalli Singareni DY CMO Madhu Kumar) అన్నారు. శనివారం ఆసుపత్రిలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం(World Blood Pressure Day) నిర్వహించారు. కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి ఏరియా హాస్పిటల్ డివై సీఎంఓ డాక్టర్ ఎం మధు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధిక రక్త పోటు వలన సింగరేణిలో చాలామంది కార్మికులు కార్మిక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. రక్తపోటు వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలాగే మన సింగరేణిలో దాదాపు టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ కి రక్తపోటు ఉందినీ వెల్లడించారు.

రక్తపోటును అరికట్టడానికి నూనె పదార్థాలు అధికంగా తీసుకోకూడదన్నారు. కొవ్వు పదార్థాలు కూడా తీసుకోకూడదనీ పేర్కొన్నారు. సిగరెట్లు బీడీలు తాగకూడదనీ, అలాగే మద్యపానానికీ దూరంగా ఉండాలని కోరారు. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్త నివేదికలు తెలియ చేస్తున్నాయనీ వివరించారు. కార్మికులు కార్మిక కుటుంబాలు సరైన జాగ్రత్తలు పాటించాలని ఉద్బోధించారు. భారతదేశంలో దాదాపు 25 లక్షల మంది అధిక రక్త పోటు బాధితులు ఉన్నారన్నారు.  ప్రపంచం మొత్తం మీద  20 లక్షల మంది రక్తపోటు బాధితులే ఉన్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో రక్తపోటు తగ్గించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ స్టాఫ్ నర్స్ గా ఎన్నికైన బీ.రసరంజని కుమారిని శాలువాతో సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ Matron, ఏఐటీయూసీ ప్రతినిధులు డి ఆర్ శ్రీధర్, ఫిట్ సెక్రటరీ అన్వేష్, కమిటీ సభ్యులు, ఇతర యూనియన్ నాయకులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.