calender_icon.png 12 September, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించినందుకు రాస్తారోకో

12-09-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 11 (విజయ క్రాంతి): నగరంలోని కిసాన్ నగర్ లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నేడు  కిసాన్ నగర్ డివిజన్ ప్రజలు, దళిత సంఘాలతో కలిసి విగ్రహం తొలగించిన చోట నుండి నిరసన ర్యాలీ, గాంధీ చౌక్ వద్దకు చేరుకొని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకొని..

నిరసన కారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు.. కంసాల శ్రీనివాస్, నక్క ప్రమోద్, గోస్కి శంకర్ లు మాట్లాడుతూ అర్ధరాత్రి పూట ఎవరికి సమాచారం ఇవ్వకుండా దొంగతనంగా అవమానకరమైన పద్ధతిలో విగ్రహాన్ని జెసిబి తో తొలగించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు.

ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లు దీనికి బాధ్యత వహించి దళితులకు సమాధానం చెప్పాలని, తిరిగి విగ్రహాన్ని మరల పునర్ ప్రతిష్టించాలని.. లేనిచో తీవ్ర ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతి, సంపతి అశోక్, కళ్ళేపల్లి నవీన్, ధర్పల్లి క్రాంతి, జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ క్యాదాసి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.