25-12-2025 12:48:11 AM
ఈ నెల 1 నుంచి 22 వరకు డబ్బు బదిలీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: పోలీస్ అధికారులుగా నటిస్తున్న ఇద్దరు సైబర్ మోసగాళ్లు ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.9కోట్లను బురిడీ కొట్టించారు. ముంబైకి చెందిన 85 ఏళ్ల వృద్ధుడిని సైబర్ మోసగాళ్లు మోసం చేశారు. అతని బ్యాంకు ఖాతాను మనీలాండరింగ్, నిషేధిత ఉగ్రవాద సంస్థకు సంబంధించిన లావాదేవీల కోసం ఉపయోగించారని నేరగాళ్లు ఆరోపించారు. ఇంజనీరింగ్ కళాశాలలో మాజీ విభాగాధిపతిగా పనిచేసిన ఆ వ్యక్తి రూ.9 కోట్లు కోల్పోయి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
సైబర్ నేరగాళ్లు సదరు వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించారు. పొదుపు, మ్యూచువల్ ఫండ్లు, ఫికస్డ్ డిపాజిట్లు, షేర్లతో సహా అన్నింటినీ తమ వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని భయపెట్టారు. దీంతో వృద్ధుడు డిసెంబర్ 1 నుంచి 22 వరకు 9 కోట్ల డబ్బును బదిలీ చేశాడు. తర్వాత ఫోన్ కాల్స్ ఆగిపోవడంతో మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.