21-07-2024 01:26:41 PM
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ, ఆకాశం మేఘావృతమై ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. రోజంతా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, సాయంత్రం కొద్దిపాటి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, మధ్య తెలంగాణల్లో ఆదివారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్‌గా, గరిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 26 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నగరంలో రాత్రిపూట దాదాపు 30 మిల్లీమీటర్ల మోస్తరు వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
అటు రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి సహా ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రకారం, నిజామాబాద్‌లోని ముపుకల్‌లో 185.5 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇది ఈ నెలలో రెండవ అత్యధిక వర్షపాతం అని వాతావరణ శాఖ కేంద్రం పేర్కొంది,