calender_icon.png 24 December, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటెంట్ బాగుంటే సినిమాను ఎవరూ ఆపలేరు

24-12-2025 12:00:00 AM

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తోపాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వేంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా లో సిరి హనుమం తు, బబ్లూ, పృథ్వీరాజ్ ముఖ్యపాత్ర ల్లో నటిస్తున్నారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చి త్రాన్ని డిసెంబర్ 25 న చిత్రాన్ని  థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కథానాయకుడు అఖిల్‌రాజ్ మంగళవారం విలేకరులతో మా ట్లాడారు. ఆ విశేషాలివీ.. 

‘రాజు వెడ్స్ రాంబాయి’ సక్సెస్ తర్వాత కొంత గ్యాప్‌లోనే ‘ఈషా’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు? 

అనుకోకుండా ఈ సిని మా విడుదల డేట్ కుదిరింది. రాజు వెడ్స్ రాంబాయి కంటే ముందు ఒప్పుకున్న సినిమా ఇది. అడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిన సినిమా ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.  

ఈషా కథ వినగానే మీకు ఎలా అనిపించింది?

ఈ కథ చెప్పగానే ఎంతో షాకింగ్‌గా అనిపించింది. నేను ఎంతో ఎంగేజ్ అయ్యాను. తప్పకుండా హారర్ థ్రిల్లర్ సినిమాలు చూస్తే వారికి కొత్త అనుభూతినిస్తుంది. సినిమాలో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ సూపర్బ్. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా లైట్ ప్యాట్రాన్, విజువల్స్, సౌండ్ డిజైనింగ్ బాగుంటుంది. సినిమా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాను విడుదల చేసిన వంశీ నందిపాటి, బన్నీవాస్ ఆ సినిమా విషయాల్లో ఎలా సక్సెస్ అయ్యారో. ఈ సినిమా విషయంలో కూడా అంతే సక్సెస్ అవుతారని నమ్ముతున్నా. 

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

వినయ్ అనే పాత్రను చేస్తున్నా. నలుగురు చిన్నప్పటి స్నేహితుల్లో నేను ఒకర్ని. త్రిగుణ్, సిరి, హెబ్బా పటేల్, మైమ్ మధు వంటి మంచి నటులతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నా. దర్శకుడు శ్రీనివాస్ నుంచి కూడా చాలా నేర్చుకున్నా. ప్రతి ప్రాజెక్టును ఓన్ చేసుకొని చేస్తా ను. ఈ సినిమా పట్ల కూడా అంతే నమ్మకంతో ఉన్నా. నా వైపు నుంచి ఉన్న ప్రమో పన్ష్ కూడా చేస్తాను. లితం ఆశించకుం డా కష్టపడాలి. యూనివర్స్ మన కు కావాలిసిన ఫలితం ఇస్తుం ది. కంటెంట్ బాగున్న సినిమాను ఎవరూ ఆపలేరు.

షూటింగ్ అనుభవాలు చెప్పండి!  

అరకులో షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ పురుగు కుట్టి ఫీవ ర్ వచ్చింది. ఆ తర్వాత నెల రోజులు జ్వరం వచ్చింది. అంతే తప్ప ఇంకేమీ అనుకోని సంఘటనలు జరగలేదు. 

హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం ఎంతో ముఖ్యం కదా?!  

సౌండ్ డిజైనింగ్ భయంకరంగా ఉంటుంది. అంద రూ భయపడే విధంగా ఉం టుంది. నిజంగా హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమాను చూడలేరేమో! 

హారర్ సినిమాను ఒప్పుకోవడానికి కారణం?

వెర్సెటైల్ యాక్టర్‌గా అనిపించుకోకుడం నాకు ఇష్టం. ఇన్ని రోజులు రాజు అనే పాత్రలో ఉన్నా. ఇక ఆ పాత్ర నుంచి వినయ్ రోల్‌లో త్వరలో కనిపిస్తా. ఈ పాత్రకు  ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కంప్లీట్ డిఫరెంట్ రోల్స్.. హారర్ అంటే ఇమేజినేషన్ కేటగిరి. పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సఖియా అనే వెబ్‌సీరిస్ సంబంధించి గ్లింప్స్ చూసి దర్శకుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు.

నాకు ఈ సినిమాతో ఓ గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నా.

‘రాజు వెడ్స్ రాంబాయి’ లైఫ్‌ను ఎలా మార్చింది?

నా లైఫ్‌ను చాలా మార్చింది. ఎప్పటికి ఆ సినిమాకు, ఆసినిమా టీమ్‌కు రుణపడి ఉంటాను. నాకు ఓ ఫేస్‌ను ఇచ్చింది. అఖిల్‌రాజ్‌కు గుర్తింపు ఇచ్చింది. ఇది నాకెరీర్‌లో స్పెషల్ ప్రాజెక్ట్.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు..?

నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. అన్‌సెట్స్‌లో తరుణ్‌భాస్కర్, అనుపమతో కలిసి ఓ సినిమా చేస్తున్నా. భద్రి దర్శకుడు. రాజు వెడ్స్ రాంబాయి తర్వాత చేస్తున్న సినిమా ఇది.