02-09-2025 12:07:52 AM
ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామ చౌరస్తా వద్ద సోమవారం నాడు ఉదయం ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఆలకుంట శివ (19) అధికార అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్టు తేలడంతో పోలీసులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, శివను అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రాహుల్ రెడ్డి హెచ్చరించారు.