calender_icon.png 21 November, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి కృషి

21-11-2025 12:38:37 AM

గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వెల్లడి

ఆదిలాబాద్, నవంబర్ 20 (విజయక్రాం తి):  ప్రతి ఒక్క యువత స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఉన్నతంగా ఎదగాలని, దీని కోసం గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురు వారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీబీ చైర్మన్ అడ్డీ బోజా రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

ముందుగా ప్రముఖ రచయిత సామల సదాశివ మాస్టర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చదవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సాధించవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు గ్రూప్ స్టడీ చేయడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సులభతరం అవుతుందని సూచించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలోని రీడింగ్ రూమ్ పనులను వేగవంతం చేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

ఐటిడిఏ ఉట్నూర్లో గ్రంథాలయ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, అలాగే జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనం నిర్మాణం కోసం కూడా ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. తాంసి, బీంపూర్, లక్ష్మీపూర్ మండలాల్లో ఇప్పటికే పబ్లిక్ రీడింగ్ రూమ్లను ప్రారంభించడం జరిగిందని చెప్పా రు. 21 నెలలుగా ఆదిలాబా ద్ జిల్లాలో పనిచేస్తున్నానని, ఈ జిల్లా తనకు గోల్డెన్ మూమెం ట్స్ను అందించిందని భావోద్వేగపూరితంగా తెలిపారు.

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడు తూ... తాను ఇక్కడే గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యానని గుర్తు చేసుకున్నా రు. ముఖ్యమంత్రికి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యే క అభిమానం ఉందని, జిల్లా గ్రంథాలయం అభివృద్ధికి కొత్త ప్రతిపాదనలు పంపితే నూత న భవన నిర్మాణానికి తనవంతు సహకారం అందించి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, అధికారులు  పాల్గొన్నారు.