calender_icon.png 19 August, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే గెలుపు

19-08-2025 12:00:00 AM

- చారకొండలో బీఆర్‌ఎస్ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్రెడ్డి, జైపాల్ యాదవ్

చారకొండ, ఆగస్టు 18: ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టిందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గులాబీ జెండా ఎగరవేసేందుకు గులాబి సైనికులు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్ధన్రెడ్డి, జైపాల్ యాదవ్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాన్ని మాజీ సర్పంచ్ యాతం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్దాలు, సాధ్యం కానీ హమీలతో నమ్మించి మోసం చేసిందన్నారు.

వారి వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు రోజుకు ఒక డ్రా మాకు తెరలేపుతున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల తర్వాత రైతుబంధుకు రాంరాం చేపేందుకు కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కేసీఆర్ పెట్టిన బిక్షనేనని, ఆయన తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారారన్నారు. కానీ కరుడుకట్టిన గులాబి శ్రేణులు మాత్రం ఒక్కరూ కూడా వెళ్లలేదన్నారు. మౌళిక వసతులు లేక గ్రామాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేత ధోరణితో.. ఎక్కడా అభివృద్ధి చేయకుండా మాటలతో గారడీ చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులంతా సమిష్టిగా ముందుకు సాగి ప్రజల మన్ననలు పొంది స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలాన్నారు.

కార్యకర్తలకు ఏలాంటి సమస్యలు వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకునేందుకు తమ వంతుగా కృషి చేస్తామని, అధైర్యపడ్డాదని ధైర్యంగా ముందుకు సాగాలని మనోధైర్యాన్ని కల్పించారు. వీరికి మండలంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేత, వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్రావు, నేతలు మనోహర్, మున్సిపల్ మాజీ చైర్మన్ లు తులసిరాం నా యక్, నర్సింహగౌడ్, నేతలు గజ్జెయాదయ్య గౌడ్, కమలాకర్ రావు, రమేశ్, సలీం, చండీశ్వర్ గౌడ్, తన్నీరు రామకృష్ణ, బొడ్డుశ్రీశైలం, సురేశ్ గౌడ్, యాదగిరిగౌడ్ సవారిశ్రీనుగౌడ్, లక్ష్మణ్నాయక్, అనిశెట్టిశ్రీను, విజయ్ గౌడ్, పర్వతాలు, శేఖర్ గౌడ్, ఆంజనేయులు, జగపతి, బోజ్జయ్య, ఈదమయ్య, నారాయణరావు, సత్తయ్యగౌడ్ తదితరులుపాల్గొన్నారు.