calender_icon.png 19 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలి

19-08-2025 12:00:00 AM

తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఏపీ విద్యార్థి యువజన జేఏసీ 

ఖైరతాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, రెండు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ సభ్యులు కేంద్రప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ.. 55 కోట్ల జనా భా గలిగిన దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసుకోలేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఎంతో అసంతృప్తితో ఉన్నారని అన్నారు. రెండో పార్లమెంట్ ఏర్పాటు చేయ డం ద్వారా భవిష్యత్తులో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశము తేడా ఉండదని భారతీయుల మంత ఒకటే అనే నినాదం ప్రపంచానికి చాటి చెప్పవచ్చునని అన్నారు.

అనంతరం తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆమనగల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థి జేఏసీ సుప్రీంకోర్టు బెంచ్, రెండో పార్లమెంట్ అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంకు, విద్యార్థి సమస్యల మీద ఉమ్మడి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొమ్ము రాజు, సూర్య సాగర్, కృష్ణ బెంజిమెన్, ఈస్టర్ విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.