calender_icon.png 30 September, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనాన్స్ యజమానుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

30-09-2025 12:00:00 AM

కామారెడ్డి జిల్లా చుక్కాపూర్‌లో ఘటన 

కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడు ఫైనాన్స్ వారు వేధింపులకు తాళ లేక  ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చుక్కాపూర్ గ్రామానికి చెందిన రమేష్ భవన నిర్మాణ  కార్మికునిగా పనిచేస్తున్నాడు. 2024 జూలై కామారెడ్డి లోని ఓ ప్రైవేటు ఫైనాన్స్లో తన ఇంటిపై 6 లక్షల రుణం తీసుకున్నాడు.

ఈఎంఐ రెగ్యులర్ గా చెల్లించిన రమేష్ గత జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెల లకు సంబంధించిన కిస్తీలు చెల్లించక పోవడంతో ఫైనాన్స్ యజమానులు కొందరు ఫోన్ ద్వారా వేధింపులకు పాల్పడ్డారు. రమేష్ ఇంటికి ఫైనాన్స్ వారు ప్రాపర్టీ లీగల్ ప్రాసెస్ లో ఉందంటూ దీనిపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని ఫైనాన్స్ కంపెనీ తో నోటు రాశారు.

దీంతో మనస్థాపానికి గురైన రమేష్ ఇంట్లో దులానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ భార్య సంధ్య మాట్లాడుతూ తన భర్త ఫైనాన్స్ వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఫైనాన్స్ వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.