calender_icon.png 31 July, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో కిందపడి యువకుడి మృతి

06-12-2024 12:24:56 AM

రాజేంద్రనగర్: ఓ వ్యక్తి మద్యం మత్తులో కిందపడి మృతిచెందిన ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి గురువారం సాయంత్రం కేసు వివరాలు వెల్లడించారు. సుమారు 30 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఈనెల3న రాత్రి కోకాపేట ఆర్‌ఆర్‌ఆర్ వైన్స్ వద్ద మద్యం మత్తులో కిందపడిపోయి ఉన్నాడు. అతడు సిమెంట్ రాయిపై పడిపోవడంతో తలకు బలమైన గాయలు అయ్యాయి. డయల్ 100కు కాల్ రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చనిపోయిన వ్యక్తి నోరు, ముక్కులోంచి రక్తం వచ్చింది. అతడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. కేసు దర్యాప్తులో ఉంది.