07-08-2025 12:13:12 AM
హయత్నగర్లో ట్రెయిన్ ట్రస్ట్ శిక్షణా కేంద్రం ప్రారంభం
ఎల్బీనగర్, ఆగస్టు 6 : యువత స్వయం ఉపాధి సాధించి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన యువతీయువకుల కోసం ట్రెయిన్ ట్రస్టు ఆధ్వర్యంలో హయత్నగర్ మదర్ డైరీ రోడ్, నయారా పెట్రోల్ పంప్ వెనుక భాగంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ట్రస్టు సీఈవో అమిషా ప్రభు, హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ.. వికలాంగులు, సామాజికంగా వెనుకబడిన యువతీయువకులకు ఉపాధి ఆధారిత శిక్షణ తీసుకుంటే జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ట్రెయిన్ ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఫౌండర్ శ్రీనివాస్, నర్సింహ, దీక్ష, ట్రెయిన్ ట్రస్టు సిబ్బంది అఖిల్, శిరీష, ఉపేందర్, రాజశేఖర్, పవన్, సుమిత, దీపిక, వినయ్ తదితరులుపాల్గొన్నారు.