09-08-2025 02:14:30 AM
ప్రారంభించిన -అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ ఆగస్ట్ 8: (విజయ క్రాంతి): ఇందూర్ జిల్లా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు విలయంగా ఉందని ఎంతో మంది క్రీడాకారులు నిజాంబాద్ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందూర్ ఫుట్ బాల్ అకాడమీ వారు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించిన ఫుట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు క్రీడాలను ప్రోత్సాహించడం వల్ల విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృడంగా ఉంటారన్నారు, జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం నివేదించానన్నారు. త్వరలో స్టేడియం నిర్మాణం జరిగేలా కృషి చేస్తా అని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. నిజామాబాద్ క్రీడాకారులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 35 వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుదీర్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ గారు, బీజేపీ నాయకులు, మరవర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.