09-01-2026 12:16:38 AM
నిర్మల్‌లో ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జనవరి ౮ (విజయక్రాంతి): గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈనెల 17 నుంచి సీఎం కప్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సీఎం కప్ పోటీల నిర్వహణ నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్‌సింగ్, జిల్లా అధికారులు జీవరత్నం, రాంగోపాల్, ఆర్డిఓ రత్న కళ్యాణి పాల్గొన్నారు.