calender_icon.png 30 December, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా స్థలాన్ని విడిపించాలని ట్యాంక్ ఎక్కి..

30-12-2025 01:56:43 AM

తాండూరు, డిసెంబర్ 29 (విజయ క్రాంతి): తన ఇంటి ముందర ఉన్న స్థలాన్ని కబ్జా నుండి విముక్తి చేయాలనీ ఓ యువకుడు వాటర్ ట్యాంక్ పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. స్థానికులు, బాధిత  కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం  వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ మోసిన్ మరియు జితేందర్ రెడ్డి కుటుంబాల మధ్య గత రెండు సంవత్సరాలుగా ఇంటి ముందర ఉన్న జాగా కబ్జా విషయమై గొడవలు జరుగుతున్నాయి.

తాజాగా నేడు ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. జితేందర్ రెడ్డి మరియు అతడి భార్య పద్మ మోసిన్ ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో మోసిన్ వైరల్ చేయడంతో వివాదం మరింత పెరిగింది. దీంతో మోసిన్ బీసీ కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఎక్కి న్యాయం చేయాలని... లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సర్పంచ్ నర్సింలు ఉప సర్పంచ్ ప్రసాద్ వార్డు సభ్యులు రవి లతోపాటు భారీగా జనం గుమి గూడరు.

విషయం తెలుసుకున్న సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్త్స్ర శంకర్, గ్రామ కార్యదర్శి లాలప్ప ఘటన స్థలానికి చేరుకొని ట్యాంక్ పై నుండి దిగాలని మోసిన్ను కోరారు. తనకు తక్షణ న్యాయం జరిగితేనే దిగుతానని...పైకి ఎవరు వచ్చినా కూడా దూకుతానని చెప్పడంతో పోలీసులు వెంటనే జెసిబి సహాయంతో కబ్జా చేసిన స్థలాన్ని విడిపించారు. మోసిన్ క్షేమంగా ట్యాంక్ పై నుండి దిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మోసిన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.