calender_icon.png 30 December, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలి

30-12-2025 01:57:13 AM

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం

హుజురాబాద్, డిసెంబర్ 29 (విజయ క్రాంతి)క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలగా నిలిచి పేరు ప్రఖ్యాతులు గడించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం ,కేశవపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన వాలీబాల్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు.

ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సిపి గౌస్ అలం, హుజరాబాద్ డివిజన్ ఎసిపి వి మాధవి క్రీడాకారులతో వాలీబాల్ ఆడారు. అనంతరం ఏర్పాటుచేసిన బహుమతి ప్రధానోత్సవం లో సిపి గౌస్ అలం మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో, క్రమశిక్షణ కలిగి, ముందుకు సాగి, విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచి కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి, పాఠశాలకు, కళాశాలలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.

తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సోదర భావం పెంపొందించేందుకు ఫ్రెండ్లీ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని క్రీడా పోటీలలో గెలుపు ఓటమి సహజమేనని గెలిచినవారు, ఓడినవారు సోదర భావంతో ముందుకు సాగి క్రీడల్లో మెలకువలు అవలంబించుకొని పోటీలలో ప్రతిభ కనబరిచేందుకు ముందుకు సాగాలని క్రీడాకారులకు సిపి గౌస్ ఆలం సూచించారు.

కేశవపట్నం ఎస్త్స్ర కట్కూరి శేఖర్ రెడ్డి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో క్రీడాకారులకు, విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎస్‌ఐ శేఖర్ రెడ్డిని అభినందించారు. ఫ్రెండ్లీ వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్, ఏఎస్‌ఐ బి సంపత్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కే శ్రీనివాస్, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.