calender_icon.png 19 July, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్పల్లిలో బీజేపీ చేరడానికి తరలివచ్చిన యువకులు

18-07-2025 11:23:13 PM

ధర్పల్లి,(విజయక్రాంతి): ధర్పల్లి మండల కేంద్రంలో బీజేపి మండల అధ్యక్షులు జిర్ర మహిపాల్ ఆధ్వర్యంలో...శుక్రవారం నిర్వహించిన బీజేపి సమావేశంలో బీజేపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన అధ్యక్షుల చేతుల మీదుగా ధర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ,బిఆర్ఎస్ పార్టీ లకు చెందిన యువకులు పెద్ద ఎత్తున బీజేపి పార్టీలో చేరారు.

ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షులు యువకులకు బీజేపి కండువా కప్పి బీజేపి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడుతూ... రాబోయే స్థానిక ఎలక్షన్లలో యువకులంతా ఒక్కటై బీజేపి పార్టీ సత్తా చాటాలని అన్నారు. ప్రజల సేవనే ముఖ్యమని ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలపై అనునిత్యం పోరాడుతూ బీజేపి పార్టీ ఉనికిని అన్ని స్థానాల్లో నిలబెట్టేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు.