calender_icon.png 7 May, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువ వికాసం దరఖాస్తుదారుల సిబిల్ పరిశీలించాలి

07-05-2025 12:54:11 AM

కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, మే 6 (విజయ క్రాంతి): బ్యాంకు అధికారులు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ పరిశీలించాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు.  ఈ పథకానికి వచ్చిన దరఖాస్తులపై మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలతో కలిసి మంగళవారం  సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి  ఈ పథకం ద్వారా లబ్దిచేకూరేలా దరఖాస్తులను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.  అర్హత ఉన్న దరఖాస్తులను బ్యాంకర్స్ లాగిన్ లోకి పంపాలని, ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయని అవసరమైన  సర్టిఫికెట్ల కోసం అభ్యర్థలకు ఫోన్ చేసి  తెప్పించుకొని బ్యాంకర్స్ లాగిన్ కి పంపాలని, పూర్తి అర్హత లేని దరఖాస్తులను పెండింగ్ లో పెట్టాలని, ఏవి కూడా రిజెక్టు చేయకూడదని కలెక్టరు తెలిపారు. 

మొదటి,రెండవ కేటగిరిలకు సిబిల్ స్కోర్ అవసరం లేదని, 3, 4 కేటగిరిలలోని ధరఖాస్తులకు మాత్రం తప్పకుండా సిబిల్ స్కోర్ పరిశీలించాలన్నారు. ఒక మున్సిపాలిటివి వేరొ క మున్సిపాలిటిలో కి, అదేవిధంగా ఒక వర్గానికి సంబంధించినవి వెరొక వర్గంలోకి దరఖాస్తు వచ్చి ఉంటే వాటిని వెంటనే సంబంధిత మున్సిపాలిటికి,  సంబంధిత వర్గాలకు ఆన్ లైన్ లో పంపాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పిసిఈఓ కాంతమ్మ, డిఆర్డిఓ సాంబశివరావు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, బిసి సంక్షేమ శాఖాధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్‌ఈడి బాబు మోసిస్, ఎల్డిఎం, జిల్లా మైనార్టీ వెల్పేర్ అధికారి, హౌజింగ్‌ఈడిరమణ మూర్తి, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, అధికారులు పాల్గొన్నారు.