29-01-2026 12:03:40 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట, జనవరి 28 (విజయక్రాంతి) : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జోనల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశం మందిరంలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం ఏర్పాటుచేసిన జోనల్ అధికారులు,ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి ,వి ఎస్ టి, వ్యయ పరిశీలికుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొనీ మాట్లాడారు. ప్రతి జోన్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై జోనల్ అధికారులు నేరుగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకోకుండా ముంద స్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత జోనల్ అధికారులపై ఉందన్నారు. అలాగే వెయ్యి పరిశీలకులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలక్కుండా చూడాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే సీతారామారావు, ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, వ్యయ పరిశీలకుల నోడల్ అధికారి ప్రవీణ్ కుమార్, మాస్టర్ ట్రైనర్ రమేష్, జోనల్ అధికారులు,ఎఫ్ ఎస్ టి, వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.