29-01-2026 12:03:58 AM
శంకర్ పల్లి, జనవరి 28: పేదల అసైన్డ్ భూములను అక్రమంగా కబ్జా చేసిన పొద్దుటూరు ఎక్స్పీరియమ్ పార్క్ యాజమా న్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. బుధవారం శంకర్ పల్లి మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో గల సర్వే నెంబర్లు 305, 306, 334 భూములను సిపిఎం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎరుకల మల్లమ్మ, పెంటయ్య, రామచంద్రయ్య, శ్రీనివాసులకు చెందిన అసైన్డ్ భూములను ఈకో ఎక్స్పీరియమ్ పార్క్ యాజమాని రాందేవరావ్ లీజు పేరుతో కబ్జా చేశారని దేవేందర్ ఆరోపించారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను కమర్షియల్ ప్రయోజనాల కోసం వాడుతున్నారని, వెంటనే పి.ఓ.టి (POT) చట్టం ప్రకారం ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. శంకర్ పల్లి ఎమ్మార్వో సురేందర్, ఆర్.ఐ తేజ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని, రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని విమర్శించారు.
పేద దళితులకు చెందిన సుమారు 20 ఎకరాల భూమిని కబ్జా చేసిన రాందేవ్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మార్వో సురేందర్, ఆర్.ఐ తేజలను వెంటనే సస్పెండ్ చేయాలని, బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులకు తొత్తు లుగా మారడం సిగ్గుచేటని కలెక్టర్ వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని అల్లి దేవేందర్, సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి కోరా రు. కార్యక్రమంలో సిపిఎం శంకర్‌పల్లి మం డల కార్యదర్శి బోడ మల్లేష్, నాయకులు అశోక్, పాండు, శ్రీనివాస్ పాల్గొన్నారు.