భర్తను హత్య చేసిన భార్య

16-11-2026 | 07:13pm

బోధన్ నవంబర్ 16విజయ క్రాంతి: నిజామాబాద్ నగరంలోని కోజా కాలనీలో(Koja Colony) భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ SHO శ్రీనివాస్(One Town SHO Srinivas) సోమవారం తెలిపారు. భర్త సజ్జాద్ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన భార్య ఫర్హానా బేగం, ఆమె ప్రియుడు షేక్ మన్సూర్ ఆదివారం గొంతు నులిమి హత్య చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు