రాహుల్‌వి గాలి మాటలు

15-11-2026 | 05:20am
  1. గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామనడం పెద్ద జోక్
  2. ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లు ఎప్పుడో బుట్టదాఖలు
  3. మాటలకు చేతలకు పొంతన లేదు
  4. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు  

నవంబర్ 14(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Senior Congress leader Rahul Gandhi) నోట పలికేవన్నీ గాలి మాటలేనని, ఆయన చెప్పే ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లు ఎప్పుడో బుట్టదాఖలయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్(Union Minister Bandi Sanjay Kumar) విమర్శించారు. ఆయన మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండదని.. ఇప్పుడు గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్ప డం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.

‘భారత్ సమ్మిట్’ నిర్వహణపై శనివారం ఆయన ఒక ప్రకటనతో పాటు వీడియో సందేశం విడుదల చేశారు. రాష్ర్టంలో ఆరోగ్యశ్రీ పథకానికి నిధులివ్వకుండా తూట్లు పొడుస్తున్న ప్రభు త్వం, గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీ శారు. ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకే ఆరోగ్య భద్రత కరువైందని, జర్నలిస్టుల హెల్త్ కార్డులకే దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు.

ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని నమ్మించి గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన వివిధ సంక్షేమ బోర్డులకు ప్రభుత్వం చిల్లిగవ్వ అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వరంగల్, కామారెడ్డి డిక్లరేషన్ల అమ లు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రాక నిరుద్యోగులు గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిగ్ వర్కర్లకు ప్రతినెలా భృతితో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలన్నారు. ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలకు కమీషన్లు లేకుండా, కస్టమర్లు చెల్లించే సొమ్ము నేరుగా కార్మికులకే అందేలా చూడాలని డిమాండ్ చేశారు.

భారత్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, అందుకే రాహుల్‌గాంధీ మధ్యలోనే వెళ్లిపోయారని బండి సంజయ్ విమర్శించారు.  దేశ సమస్యలను అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప, విదేశీ వేదికల పై దేశాన్ని కించపరచడం దేశద్రోహమేనని మండిపడ్డారు. భారత్ వ్యతిరేక శక్తులతో కలిసి తెలం గాణ గడ్డను అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దశాబ్దాల పాటు ఒకే కుటుం బం దేశాన్ని పాలించడం, పార్టీని చెప్పుచేతల్లో ఉంచుకోవడమే రాహుల్ మార్క్ ప్ర జాస్వామ్యమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగ హక్కుల ను కాలరాసిన కాంగ్రెస్ నేడు ఫాసి జం గు రించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మూడు వేల మంది సిక్కులను ఊచకోత కోసినప్పుడు కాంగ్రెస్‌కు ఫాసిజం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ వందల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపిస్తున్న రాహుల్.. ఆధారాలుంటే బయట పెట్టి కోర్టులో ఎందుకు పోరాడలేదని సవాల్ విసిరారు.

మరిన్ని వార్తలు