విజయదుర్గా అమ్మవారి 17వ వార్షికోత్సవం
కొండపాక,నవంబర్16( విజయ క్రాంతి ): మర్పడగ గ్రామంలోని(Marpadaga Village) శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో(Shrine of Lord Mallikarjuna) శ్రీ విజయదుర్గా అమ్మవారి 17వ వార్షికోత్సవ వేడుకలను సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ చెప్పెల హరినాథ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత, వివిధ ఫలరసాలు, 108 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతీమణి శోభ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ సంతాన మల్లికార్జున స్వామికి అభిషేకం, హవన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు చీకోటి మల్లికార్జున్, గట్టు విటల్, మరియాల వీరేశం, దేవసాని మల్లేశం, మరియాల రవీందర్, తిరుపతి రెడ్డి, నరసింహారెడ్డి, సత్యం, సత్యనారాయణ రెడ్డి, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.