సిరీస్ చిక్కేనా ?

15-11-2026 | 05:20am

న్యూజిలాండ్ టూర్‌లో మరో సిరీస్ విజయానికి చేరువైన భారత్‌కు చివరి ఛాన్స్.. ఆదివారం కివీస్‌తో ఆఖరి వన్డే ఆడబోతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. నాలుగో వన్డేలో 89 పరుగులకే కుప్పకూలి ఘోరపరాభవం చూవిచూసిన నేపథ్యంలో ఒత్తిడంతా టీమిండియాపైనే కనిపిస్తోంది. హెన్రీ లేకున్నా చివరి వన్డే భారత్‌కు సవాలే. అటు సిరీస్ సమం చేసేందుకు ఆతిథ్య జట్టు పట్టుదలగా ఉంది.

  1. నేడు భారత్, కివీస్ చివరి వన్డే
  2. గత మ్యాచ్‌లో ఘోరపరాజయం
  3. ఒత్తిడిలో భారత బ్యాటర్లు
  4. సిరీస్ సమంపై కివీస్ కన్ను

మౌంట్ మాంగనూయ్, నవంబర్ 14: భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్(India, New Zealand ODI series) క్లైమాక్స్‌కు చేరింది. వరుణుడు వెంటాడినా రెండు వన్డే లు గెలిచి జోరు మీద కనిపించిన టీమిండియాకు(Team India) నాలుగో వన్డేలో దిమ్మతిరిగే షాక్ తగిలింది. కివీస్ పేస్ దెబ్బకు కుదేలై ఘో రంగా ఓడిపోయింది. అటు సిరీస్ సమం చేసే అవకాశాలు నిలుపుకున్న న్యూజిలాండ్(New Zealand) ఇప్పుడు భారత్‌పై తన జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.

ఆదివారం జరగ బోయే ఈ మ్యాచ్‌లో టీమిండియాపేనే ఒత్తి డి నెలకొంది. ముఖ్యంగా ఈ టూర్‌లో తొలిసారి భారత బ్యాటర్లకు పేస్ పరీక్ష ఎదుర వ గా అందరూ చేతులెత్తేశారు. రోహిత్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌తో సహా అందరూ నిరాశపరిచారు. చివరి వన్డేలో బ్యాటర్లు రాణించ డంపైనే సిరీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే నాలుగో వన్డేలో భారత్ ను దెబ్బకొట్టిన మ్యాట్ హెన్రీ చివరి వన్డేలో ఆడడం లేదు.

టెస్ట్ సిరీ స్ సన్నాహాల కోసం అతనికి కివీస్ మేనేజ్ మెంట్ రెస్ట్ ఇచ్చింది. అయినప్పటకీ భారత బ్యాటర్లకు స్వింగ్ పరీ క్ష తప్పేలా లేదు.  కివీస్ గడ్డపై రోహిత్, కోహ్లీ చివరి వన్డే ఆడబోతున్నారు. ఈ సిరీస్ లో రోహిత్,  కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన రాలేదు.  చివరి వన్డేలోనైనా సీనియర్ బ్యాటర్లు బాధ్య త తీసుకోవాల్సి ఉంది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లకు కూడా తమ సత్తా చాటుకునే అవకాశం ఉంది.

బే ఓవల్ పిచ్ సాధారణంగా పేసర్లకు మంచి సహకారం అందిస్తుంది.  నాలుగో వన్డేలో భారత పేసర్లు కూడా పవర్‌ప్లే లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చివరి మ్యాచ్‌లో భారత బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. చివరి వన్డేలో భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారిం ది. టెస్టు సిరీస్‌కు ముందు మహమ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కొచ్చు. న్యూజిలాండ్ జట్టులోనూ టెస్టు సిరీస్ సన్నాహాల కోసం కొందరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు.  

తుది జట్ల అంచనా

భారత్: రోహిత్, ఇషాన్ కిషన్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రుతురాజ్, న మ న్ ధీర్, అక్షర్, నబీ, సిరాజ్, బ్రార్, అర్షదీప్

న్యూజిలాండ్: అలెన్, సిఫెర్ట్ (కీపర్), విల్ యంగ్, నిక్ కెల్లీ, మిఛ్ హే, బ్రేస్వెల్, శాంట్నర్(కెప్టెన్), ఫాక్స్క్రాఫ్ట్, ఫిషర్,   క్లార్క్, డ ఫీ

మరిన్ని వార్తలు