ఫైనల్లో లక్ష్యసేన్
కుమామోటో మాస్టర్స్ టోర్నీ
టోక్యో, నవంబర్ 14: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్(Indian star shuttler Lakshya Sen) కుమామోటో మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగి ల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్య సేన్ 21 15- 21 ఇండోనేషియాకు చెందిన అల్వి ఫర్హాన్‌ను ఓడించాడు. సుమారు 70 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో గెలిచి, ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారతీయ షట్లర్‌గా నిలిచాడు.
లక్ష్యసేన్ ఆరంభం నుంచే వేగవంతమైన డ్రైవ్లు, నెట్ వద్ద ఆధిపత్యంతో చెల రేగాడు. 9- ఆధిక్యంలోకి దూసుకెళ్లిన అత ను, విరామ సమయానికి ౧1 ముం దంజలో నిలిచాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి సునాయాసంగా తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో అల్వీ ఫర్హాన్ పుంజుకుని స్కోరు సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో లక్ష్యసేన్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాడు.
పదునైన స్మాష్లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21- మ్యాచ్‌ను ముగించా డు. ఆదివారం జరిగే ఫైనల్‌లో జపాన్‌కు చెందిన కోకి వతనాబేతో లక్ష్యసేన్ తలపడతాడు. ఇటీవల జర్మనీలో జరిగిన హైలో ఓపెన్ టైటిల్ గెలిచిన లక్ష్యసేన్, ఇప్పుడు వరుసగా రెండో బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌పై కన్నేశాడు.