పెన్షన్‌ పంపిణీ.. పేదల ఇంట ఆనందం.!

16-11-2026 | 07:14pm
  1. - గోపతండలో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
  2. - ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాలతో లబ్ధిదారులకు పింఛన్ల అందజేత
  3. - సర్పంచ్ భూక్య బిక్కు నాయక్ చేతుల మీదుగా పంపిణీ

మోతె, నవంబర్ 16 (విజయక్రాంతి): పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు లబ్ధిదారుల జీవితాలకు భరోసాగా నిలుస్తున్నాయని గోపతండ గ్రామ సర్పంచ్ భూక్య బిక్కు నాయక్ అన్నారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి(MLA Nalamada Padmavathi Reddy) ఆదేశాల మేరకు మోతె మండల పరిధిలోని గోపతండ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్య బిక్కు నాయక్ అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాలోతు ఈశ్వరి రవి, కార్యదర్శి సురేష్, మాజీ ఎంపీటీసీ శ్రీరాములు, వార్డు సభ్యులు గుగులోతు బాసు, అశ్విని, గుగులోతు రాములు, మాజీ ఉపసర్పంచ్ గుగులోతు సీతమ్మ, కొర్ర సాయికుమార్, గుగులోతు మాలు, పెన్షన్ లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు