ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతం..
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు : కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్..
ఆలేరు, నవంబర్ 16 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో భువనగిరి పట్టణంలోని 22వ వార్డులో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్(Councilor Jaligam Vignesh) తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని వార్డులో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇందిరానగర్లో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పనుల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సల్ల యాదగిరి, ఇటుకల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.