స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫోటో ఎందుకు లేదు?
జహీరాబాద్ టౌన్, నవంబర్ 16: జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) స్మార్ట్ రేషన్ కార్డులు, చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం(Document distribution event) నిర్వహించిన నేపథ్యంలో 36వ వార్డు కౌన్సిలర్ అప్పం శ్రవణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో కూడా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా అప్పం శ్రవణ్ మాట్లాడుతూ.. పేదలకు ప్రతి నెలా 6 కిలోల ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం ద్వారా కోట్లాది మంది పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతున్నప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఎందుకు ముద్రించడం లేదని నిలదీశారు.రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని, ప్రధాని మోదీ ఫోటోను స్మార్ట్ రేషన్ కార్డులపై ముద్రించాలని డిమాండ్ చేశారు.