చెరకు తోటలో అగ్నిప్రమాదం

16-11-2026 | 08:19pm

మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

గాంధారి, నవంబర్ 16 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతే గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డికి సంబంధించిన మూడు ఎకరాల చెరకు తోటలో అగ్నిప్రమాదం(sugarcane field) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు ఎకరంన్నర విస్తీర్ణంలోని చెరకు పంట అగ్నికి ఆహుతైంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో మంటలు మరింత విస్తరించకుండా నివారించారు. ఈ అగ్నిమాపక చర్యల్లో ఫైర్ సిబ్బంది రాజిరెడ్డి, టీవీ రాజు, శివాజీ, కిషన్, రమేష్ పాల్గొన్నారు. అగ్నిప్రమాదంతో రైతుకు పంట నష్టం వాటిల్లడంతో బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు...

మరిన్ని వార్తలు