సిపిఎస్ రద్దు కోసం సామూహిక సెలవు

16-11-2026 | 08:16pm

కార్యక్రమానికి  టీఎస్ ఏపిఎఫ్ సంపూర్ణ మద్దతు.

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 16, విజయ కాంతి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా(Telangana State) మంగళవారం (17.11.2026) సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు చేపడుతున్న సామూహిక సెలవు కార్యక్రమానికి తెలంగాణ  ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ (టీ ఎస్ ఏ టీ ఎఫ్ )(Telangana Adivasi Teachers Federation) వెంకటాపురం మండల  కమిటీ తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోంది.

ఈ సందర్భంగా ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు సంబంధించిన  సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ( ఓ పి ఎస్) పునరుద్ధరించాలనే ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌కు  ఎస్ టి ఏ టి ఎఫ్ వెంకటాపురం మండలం  కమిటీ సంఘీభావం తెలియజేస్తోంది.

ఉద్యోగుల పదవీ విరమణ అనంతర జీవితానికి భరోసా కల్పించే  ఓ పి ఎస్ పునరుద్ధరణ కోసం ఉపాధ్యాయులు చేపడుతున్న ఈ కార్యక్రమానికి, టీఎస్ ఏటీఎఫ్ తన మద్దతును తెలియజేస్తోంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోరం రాంబాబు, మండలం కార్యదర్శి కుచ్చింటి ఇందిరా దేవి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు