కష్టపడితేనే విజయం వరిస్తుంది

16-11-2026 | 08:18pm

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ 

భూపాలపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): కష్టపడితేనే విజయం వరిస్తుందని నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma), ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. సోమవారం ఉచిత శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్పీ అభ్యర్థులతో మాట్లాడి శిక్షణ, వసతులపై వివరాలు తెలుసుకున్నారు.

పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు క్రమశిక్షణతో పట్టుదలగా చదవాలని కలెక్టర్ సూచించారు. పేద అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. రాత పరీక్షలతో పాటు పోలీస్ ఉద్యోగాలకు అవసరమైన శారీరక దారుఢ్య శిక్షణ కూడా అందిస్తామని, ప్రధాన పరీక్షల వరకు శిక్షణ కొనసాగిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా అభ్యర్థులకు అధ్యయన సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ సంపత్ రావు, టౌన్ సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు