రహదారిపై గ్రామస్తుల రాస్తారోకో
ములకలపల్లి,నవంబర్ 16 (విజయక్రాంతి): కంపగూడెం మీదుగా భారీ వాహనాల రద్దీని(Heavy vehicle traffic) తక్షణమే నిలుపుదల చేయాలని సోమవారం కంపగూడెం గ్రామంలో రహదారిపై రెండు గంటలపాటు గ్రామస్తులు భారీ రాస్తారోకో నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ హామీతో గ్రామస్తులు రాస్తారోకోను విరమించారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు నిమ్మల మధు మాట్లాడుతూ కంపగూడెం గ్రామంలో భారీ వాహనాల కారణంగా బీటి రోడ్డు దెబ్బతిన్నదని మరమ్మతులు తక్షణమే చేపట్టాలి డిమాండ్ చేశారు. గ్రామం మీదుగా భారీ వాహనాల రాకపోకల కారణంగా ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందోనని భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారన్నారు.
వాహనాల వల్ల ఇళ్లల్లోకి దుమ్ము, దూళి చేరుకుని గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.రాజుపేట బ్రిడ్జి వద్ద 60 లక్షల రూపాయలతో డైవర్షన్ రోడ్డు నిర్మించి వర్షాల కారణంగా తెగిపోయినందున కంపగూడెంలోని అతి చిన్న రహదారిపై పెద్ద వాహనాలు నడపడం వల్ల రోడ్డు కొట్టుకుపోయి గుంటలు పడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కంపగూడెం గ్రామానికి తక్షణమే బీటి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కంపగూడెం గ్రామస్తులకు బిటి రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గుర్రం రాము,సున్నం గోపయ్య, కరుణాకర్,వార్డు సభ్యులు సడియం చిట్టెమ్మ,సున్నం సునీత,గడ్డం వెంకటేశ్వర్లు,సున్నం రమాదేవి, వినయ, ఊకె మహేశ్వరి,వెలకం ఈశ్వరి,గుర్రం సత్యవేణి, ఊకె ఆదిలక్ష్మి, యాకూబ్ పాషా, గుర్రం బాలాజీ, సంపత్, సున్నం శ్రీను,పూనెం రామక్రిష్ణ, ఊకె కిరణ్, తదితరులు పాల్గొన్నారు.