రెండు గ్రామాల్లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
సాలూర, నవంబర్15(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ల పథకం (Cheyutha Pension Scheme) ద్వారా నిరుపేదలు, వృద్ధులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని సాలంపాడ్ క్యాంప్ సర్పంచ్ తూము అంజమ్మ, కుమ్మన్పల్లి సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి అన్నారు.
సాలూర మండల పరిధిలోని సాలంపాడ్ క్యాంప్ మరియు కుమ్మన్పల్లి రెండు గ్రామాలలో కొత్తగా మంజూరైన చేయూత పెన్షన్ పత్రాలను వారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం చేయూత పెన్షన్లను అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రంలో ఆయా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.